అసోంలో 5.1 తీవ్రతతో భూకంపం- త్రిపుర, మేఘాలయలో భూప్రకంపనలు
ఈశాన్య రాష్ట్రాలైన అసోం, త్రిపురలోని వివిధ ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. అసోంలోని తీవ్రత 5.1గా నమోదైంది. త్రిపురలోని గోమతిలో 3.9గా నమోదైంది. మోరిగావ్‌కు 50కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని ప్రభావంతో మేఘాలయలో కూడా వివిధ చోట్ల స్వల్పంగా భూమి కంపించింది.
అసోంలో సోమవారం తెల్లవారుజామున 4:17గంటలకు భూకమి భూకంపించింది. రిక్టార్ స్కేలుపై తీవ్రత 5.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలాజీ(ఎన్సీఎస్) పేర్కొంది. అయితే భూకంపం కేంద్రం బ్రహ్మపుత్ర దక్షిణ ఒడ్డున ఉన్న మోరిగావ్ జిల్లాలో 50 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో మేఘాలయలో కూడా వివిధ చోట్ల స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.అంతుకుముందు తెల్లవారుజామున 3:30 సమయంలో త్రిపురాలో కూడా భూకంపం సంభవించింది. గోమటి అనే ప్రాంతంలో రిక్టార్ స్కేలుపై తీవ్ర 3.9గా నమోదైంది. అయితే ఈ భూకంపంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు.


Pratiroju 




