గాంధీ ఫ్యామిలీలో పెళ్లి బాజాలు.. ప్రియాంక గాంధీ కోడలు ఎవరో తెలుసా?

గాంధీ ఫ్యామిలీలో పెళ్లి బాజాలు.. ప్రియాంక గాంధీ కోడలు ఎవరో తెలుసా?

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా దంపతుల కుమారుడు రెహాన్ వాద్రా(25) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత ఏడేళ్లుగా తను ప్రేమిస్తున్న తన చిరకాల స్నేహితురాలు అవివా బేగ్‌తో రైహాన్ నిశ్చితార్థం జరిగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రెహాన్ వాద్రా, అవివా బేగ్ గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇటీవల రెహాన్ తన ప్రేమ విషయాన్ని అవివాకు తెలపగా.. ఆమె వెంటనే అంగీకరించినట్లు సమాచారం. ఈ జంటకు ఇరు కుటుంబాల పెద్దలు కూడా తమ పూర్తి అంగీకారాన్ని తెలిపారు.

ఎవరీ అవివా బేగ్?
అవివా బేగ్ కుటుంబం దేశ రాజధాని ఢిల్లీకి చెందినది. రాబర్ట్ వాద్రా, అవివా బేగ్ కుటుంబాల మధ్య చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రెహాన్ వాద్రా తరహాలోనే అవివా బేగ్ కూడా ప్రైవేట్ లైఫ్ గడపడానికే ఇష్టపడతారని సమాచారం.

లో-ప్రొఫైల్‌లో వేడుక
రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ, రెహాన్ వాద్రా ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగా ఉంటూ 'వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్'గా, 'ఆర్టిస్ట్'గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వీరి నిశ్చితార్థ వేడుక కూడా అత్యంత సన్నిహితుల మధ్య చాలా ప్రైవేట్‌గా జరిగినట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం పూర్తిగా వ్యక్తిగతంగా జరగగా.. అధికారిక ఫోటోలు ఇంకా విడుదల కాలేదని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు, పెళ్లి తేదీ అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.