ఇంద్రకిలాద్రిపై అమ్మ వారిని దర్శించుకున్న మెగా డైరెక్టర్ అనిల్ రావిపూడి..

ఇంద్రకిలాద్రిపై అమ్మ వారిని దర్శించుకున్న మెగా డైరెక్టర్ అనిల్ రావిపూడి..
ఇంద్రకిలాద్రిపై అమ్మ వారిని దర్శించుకున్న మెగా డైరెక్టర్ అనిల్ రావిపూడి..

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. కాగా ఈరోజు మహా విష్ణువును వైకుంఠ ద్వారం దర్శనం చేసుకుంటే మోక్షప్రాప్తి కలుగుతుందనే లక్షలాది మంది భక్తులు విశ్వసిస్తారు. అందుకే తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి విష్ణువును ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వైష్ణవ ఆలయాలు శోభతో వెలిగిపోతుండగా.. సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం ప్రముఖ ఆలయాలకు క్యూ కడుతున్నారు.

ఈ క్రమంలోనే విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని దర్శకుడు అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. ఆయన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "మన శంకర వర ప్రసాద్" చిత్రం భారీ విజయం సాధించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా ఈ మేరకు ఆలయ అధికారులు అనిల్ రావిపూడికి ఘనస్వాగతం పలికారు. వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా.. అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు.