ఆటో డ్రైవర్‌ నిజాయతీ.. రూ.4లక్షల బంగారు నగలను అప్పగించి

ఆటో డ్రైవర్‌ నిజాయతీ.. రూ.4లక్షల బంగారు నగలను అప్పగించి

కడప క్రైమ్‌: నగరంలో ఓ ఆటో డ్రైవర్‌ నిజాయతీ చాటుకున్నాడు. ఆటోలో ఓ ప్రయాణికురాలు మరిచిపోయి వెళ్లిన రూ.4 లక్షల విలువచేసే బంగారు నగలను చిన్నచౌక్‌ పోలీసులకు అప్పగించాడు. పోలీసులు ఆ నగలను బాధితురాలికి అప్పగించారు. ఆటో డ్రైవర్‌ను అభినందించారు.