మెగా విక్టరీ మాస్‌ సాంగ్‌: ఏంటి బాసూ సంగతీ.. అదిరిపోద్దీ సంక్రాంతీ..

మెగా విక్టరీ మాస్‌ సాంగ్‌: ఏంటి బాసూ సంగతీ.. అదిరిపోద్దీ సంక్రాంతీ..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆర్‌ యూ రెడీ’ అంటూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు అగ్రకథానాయకులు చిరంజీవి, వెంకటేశ్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌ గారు’. వెంకటేశ్‌ అతిథి పాత్రలో సందడి చేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా ‘ఆర్‌ యూ రెడీ’ అనే మాస్‌ సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు (Mega Victory Mass Song). ‘ఏంటి బాసూ సంగతీ.. అదిరిపోద్దీ సంక్రాంతీ.., ఏంటి వెంకీ సంగతీ.. ఇరగతీద్దాం సంక్రాంతీ..’ అంటూ సాగే హుషారైన లిరిక్స్‌ను కాసర్ల శ్యామ్ రాశారు.