కొత్త ఏడాదిలో...! ఉచిత బస్సుల్లో మహిళలకు మరో గుడ్ న్యూస్..!

కొత్త ఏడాదిలో...! ఉచిత బస్సుల్లో మహిళలకు మరో గుడ్ న్యూస్..!
కొత్త ఏడాదిలో...! ఉచిత బస్సుల్లో మహిళలకు మరో గుడ్ న్యూస్..!

మహిళలకు ఉచిత బస్సు అందిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయాణాలు చేసేటప్పుడు గుర్తింపు కార్డు చూపించాలనే నిబంధన పెడుతున్నాయి. అయితే ఏ రాష్ట్రం బస్సులో ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా తిరుగుతాయి. అలాగే అందులో ప్రయాణించే మహిళలకు కూడా సాధారణంగా ఆ రాష్టానికి చెందిన వారే ఉంటారు. అటువంటప్పుడు వారికి బస్సుల్లో ఉచిత ప్రయాణాలకు గుర్తింపు కార్డులు చూపించాలనే నిబంధన అవసరమా అనే చర్చ జరుగుతోంది.

ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు అందిస్తున్న స్త్రీ శక్తి పథకం అమల్లో భాగంగా గుర్తింపు కార్డులు చూపించి ప్రయాణాలు చేయాలనే రూల్ పెట్టారు. అయితే దీని వల్ల అదనంగా ప్రభుత్వానికి కలుగుతున్న లాభం అంటూ ఏమీ లేదు. కానీ ఆర్టీసీ ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోందట. ఇదే విషయాన్ని తాజాగా ఆర్టీసీ ఉద్యోగ సంఘం ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో సీఎం చంద్రబాబు కూడా దీనిపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.ఈ మేరకు కొత్త ఏడాదిలో ఈ గుర్తింపు కార్డుల నిబంధన తొలగించే అవకాశం ఉంది. రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో అమలు చేసి ఇతర ప్రాంతాల్లో ఈ గుర్తింపు కార్డులు చూపించి ప్రయాణాలు చేయాలనే నిబంధన తొలగిస్తారని చెప్తున్నారు. ప్రభుత్వం త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.