'మన శంకరవరప్రసాద్ గారు' ట్రైలర్ వచ్చేసింది- వింటేజ్ మెగాస్టార్ ఈజ్ బ్యాక్!
మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మూవీమేకర్స్ ఆదివారం తిరుపతిలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్లోనే సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. పూర్తిగా కామెడీనే కాకుండా చిరు స్టైల్‌కు తగ్గట్లుగా మాస్ ఎలిమెంట్స్‌ను కూడా అనిల్ జోడించారు.
ట్రైలర్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మార్క్ కనిపించింది. 'ఇంటలిజెన్స్ బ్యూరో, రా ఏంజెట్, ఎలాంటి క్రిమినల్‌ను అయినా ఉతికారేస్తారు' అంటూ ఎలివేషన్ ఇస్తూనే చిరును ఫ్యామిలీ మ్యాన్‌లా చూపించారు. కామెడీ సీన్స్‌లో వింటేజ్ చిరును గుర్తు చేసేలా ట్రైలర్ ఉంది. పైకీ గంభీరంగా ఉంటూన్నా భార్యకు మాత్రం కాస్త భయపడే భర్తలా క్యారెక్టర్‌ను చూపించారు. చిరు- నయనతార మధ్య సన్నివేశాలు ఫన్నీగా ఉన్నాయి. ఈ సీన్స్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
'మనల్ని టార్చర్ పెట్టే పెళ్లాం తరపు బంధువుల్ని ఆడుకుంటే మజాగా ఉంటుంది' అని చిరు డైలాగ్ చెప్పడం చూస్తుంటే ఈ సినిమాలో చిరును నయన్ టార్చర్ పెట్టారేమో అనిపిస్తుంది. ఇక ఫ్యామిలీ మ్యాన్లాగానే కాకుండా ఫ్యాన్స్ కోసం ఆయనలోని మాస్ ఎలిమెంట్స్ కూడా టచ్ చేశారు. గోల్ఫ్ కోర్ట్‌లో ఫైట్, యాక్షన్ సీక్వెన్స్స్ కూడా జోడించారు. దీంతో ఇది మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ సినిమాలాగా అనిపిస్తుంది.
ఇక ట్రైలర్ ఆఖర్లో వెంకటేశ్ ఎంట్రీ చూపించారు. ఈ ఇద్దరి మధ్య డైలాగ్ అదిరిపోయింది. 'ఫ్యామిలీ మ్యాన్‌లా ఉన్నావ్, మాస్ ఎంట్రీ ఇచ్చావేంటీ?' అని వెంకీతో చిరుతో అనగా, 'మాస్కే బాస్‌లా ఉన్నావ్, నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి?' అని వెంకీ రిప్లై ఇస్తారు. ఇలా ఓవరాల్‌గా 2.40 నిమిషాల ట్రైలర్ ఆధ్యంంతం ఆకట్టుకుంటుంది.
తిరుపతిలో ఏర్పాటు చేసిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ అనిల్ మాట్లాడారు. పూర్తిగా చిరంజీవి మాస్ అండ్ కామెడీ ఇమేజ్‌లో వచ్చిన లీడర్ రాజు (ఘరానా మొగుడు), ఆటో జానీ (రౌడీ అల్లుడు) పాత్రలను దృష్టిలో ఉంచుకొని ఈ కథ రాసినట్లుగా చెప్పారు. అలా రాసుకున్న ఈ స్టోరీని చిరంజీవి తన అనుభవంతో పీక్స్‌లోకి తీసుకెళ్లారని అన్నారు. జనవరి 12న ఫ్యాన్స్ అందరూ 'మెగా' వైబ్స్ ఎంజాయ్ చేస్తారని అనిల్ జోష్ నింపారు. అలాగే హీరోయిన్ నయనతారకు, మెగాఫ్యాన్స్ అందరికీ అనిల్ థాంక్స్ చెప్పారు.
కాగా, ఇందులో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. విక్టరీ వెంకేటేశ్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. భీమ్స్ సిసిరొలియో సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, కొనిదెల సుస్మిత సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఫైనల్ ఎడిటింగ్ రీసెంట్‌గానే పూర్తి అయ్యింది. ఇది 2 గంటల 35 నిమిషాల రన్టైమ్తో సంక్రాతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.


Pratiroju 




