నేనున్నా.. కష్టపడి బాగా చదువుకోండి..

నేనున్నా.. కష్టపడి బాగా చదువుకోండి..

‘ఎలాంటి ఆపద వచ్చినా అండగా నేనుంటా. కష్టపడి బాగా చదువుకొని ఉన్నతస్థాయికి చేరుకోవాలి బిడ్డా..’ అంటూ మాజీ సీఎం కేసీఆర్‌ నిరుపేద విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లి గ్రామంలో ఇటీవల జరిగిన విద్యుత్తు ప్రమాదంలో సత్తయ్య అనే రైతు మృతి చెందారు. ఆయన కుమారుడు నవీన్‌ బీటెక్‌ చదువుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో చదువు ఆపేసే పరిస్థితి వచ్చింది. ఇదే గ్రామానికి చెందిన మరో నిరుపేద రైతు పెద్దోళ్ల సాయిలు కొన్నేళ్ల కిందట మృతి చెందారు. ఆయన కుమారుడు అజయ్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి. వీరి దీన పరిస్థితి తెలుసుకున్న కేసీఆర్‌ పిలిపించి మాట్లాడారు. ఆ విద్యార్థులు, తల్లులు గురువారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి రాగా చెక్కులను అందజేశారు. ఉన్నత చదువులకయ్యే ఖర్చంతా భరిస్తానని భరోసా ఇచ్చారు.