డిజిటల్ డిపాజిట్ల మోసం.. ఫాల్కన్ ఎండీ అమర్దీప్ అరెస్ట్
ఫాల్కన్ ఎండీ అమర్‌దీప్‌ను తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబయిలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అమర్‌దీప్‌పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో గల్ఫ్ నుంచి ఆయన ముంబయికి చేరుకోవడంతో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకొని తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
డిజిటల్ డిపాజిట్ల పేరిట అమర్దీప్ రూ.850 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. యాప్ ఆధారిత డిపాజిట్లతో ఫాల్కన్ సంస్థ భారీ కుంభకోణానికి తెరతీసింది. షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో ప్రజలను అమర్ మభ్యపెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్కామ్ వెలుగులోకి రాగానే అమర్దీప్ దంపతులు దుబాయ్‌కి పారిపోయారు. ఈ కేసులో ఇప్పటికే సీఈవో, అమర్దీప్ సోదరుడిని అధికారులు అరెస్ట్ చేశారు.


Pratiroju 




