డ్రంక్ అండ్ డ్రైవ్.. హైదరాబాద్లో 2,731 కేసులు నమోదు
హైదరాబాద్: నూతన సంవత్సరం సందర్భంగా నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా వాహనాలను పట్టుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 2,731 మందిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,198 మంది, సైబరాబాద్లో 928 మంది, రాచకొండ కమిషరేట్ పరిధిలో 605 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు.


Pratiroju 




