పరకామణి కేసులో.. కుమ్మక్కైన ఆ పోలీసులెవరు?

పరకామణి కేసులో.. కుమ్మక్కైన ఆ పోలీసులెవరు?

ఈనాడు- అమరావతి, ఈనాడు డిజిటల్‌- తిరుపతి, న్యూస్‌టుడే- తిరుపతి నేర విభాగం: వైకాపా హయాంలో తిరుమల శ్రీవారి పరకామణిలో జరిగిన చోరీ కేసుకు సంబంధించి నిందితుడు రవికుమార్, మరికొందరితో కుమ్మక్కైన పోలీసు అధికారులెవరు, ఈ కేసు బలహీనపరచటంలో కుట్రదారులైన పోలీసు అధికారులెవరు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ‘నిందితుడు రవికుమార్, మరికొంతమందితో అప్పట్లో పనిచేసిన పలువురు పోలీసు అధికారులు కుమ్మక్కయ్యారనేది సీఐడీ నివేదికలో వెల్లడైంది. ఈ కేసును బలహీనపరచటంలో కుట్రదారులైన పోలీసు అధికారులపై క్రమశిక్షణచర్యలు తీసుకోవాలి’ అంటూ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. దీంతో ఆ పోలీసు అధికారులు ఎవరనే చర్చ జరుగుతోంది. లోక్‌ అదాలత్‌తో ఈ కేసు రాజీ మినహా ఇతర అంశాల్లో చట్టప్రకారం ముందుకెళ్లొచ్చని సీఐడీ, ఏసీబీ అధికారులకు హైకోర్టు చెప్పటంతో ఇకపై జరగబోయే దర్యాప్తులో ఆయా పోలీసు అధికారుల ప్రమేయం, పాత్రకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. పరకామణిలో చోరీ, ఆ కేసు రాజీ జరిగిన సమయాల్లో కీలక స్థానాల్లో ఉన్న పోలీసు అధికారుల ప్రమేయంపై తీవ్ర ఆరోపణలున్నాయి. 

  1. జగన్మోహన్‌ రెడ్డి (అప్పటి తిరుమల వన్‌టౌన్‌ సీఐ):
  2. 2. చంద్రశేఖర్‌ (అప్పటి తిరుపతి 2 టౌన్‌ సీఐ):
  3. 3. రామలక్ష్మీరెడ్డి (అప్పటి తిరుమల వన్‌ టౌన్‌ ఎస్‌ఐ):
  4. డి.నరసింహకిషోర్‌ (అప్పటి సీవీఎస్‌వో, ప్రస్తుత తూర్పుగోదావరి ఎస్పీ):
  5.  పరమేశ్వరరెడ్డి (అప్పటి తిరుపతి ఎస్పీ, ప్రస్తుత సీఐడీ ఎస్పీ):

చోరీ కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా చేయటంలోనూ, తర్వాత కేసు రాజీలోనూ ఆయన కీలక పాత్ర పోషించారనే ఆరోపణలున్నాయి. కొందరు ముఖ్య నాయకుల ఆదేశాలతో ఆయనే తెరవెనక చక్రం తిప్పారనే ఫిర్యాదులున్నాయి.