తిరుమలలో వైకుంఠ ఏకాదశి.. ప్రముఖుల దర్శనం

తిరుమలలో వైకుంఠ ఏకాదశి.. ప్రముఖుల దర్శనం

తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం ఘనంగా జరుగుతోంది. మంగళవారం తెల్లవారుజామున 1.30 గంటలకు వైకుంఠ ద్వార తలుపులు తెరుచుకున్నాయి. ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకుని స్వామివారి దర్శనం చేసుకున్నారు. సినీ నటుడు నారా రోహిత్ దంపతులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్, తదితరులు శ్రీవారి ఆశీస్సులు పొందారు.