రాజావారి కోట కాదిది.. పోలీసు ఠాణానే
రాజుల కాలంలోని కోట తరహాలో కనిపిస్తున్న ఈ భవనం పోలీస్‌స్టేషన్ అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. కాకినాడ జిల్లాలోని కోటనందూరు ఠాణా ఇది. మండల కేంద్రంలోని ప్రధాన రహదారి సమీపంలో ఉంటుంది. దృఢమైన రాళ్లతో, ఎత్తయిన గోడలతో ఇలా నిర్మించడం వెనుక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. మూడు దశాబ్దాల క్రితం రౌతులపూడి, నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో నక్సల్స్ ప్రాబల్యం తీవ్రంగా ఉండేది. దీంతో మావోయిస్టుల దాడులను తట్టుకునేలా, భద్రతే ప్రధాన లక్ష్యంగా ఈ విధంగా నిర్మించారు. 2001 మార్చి 9న శంకుస్థాపన చేయగా మరుసటి ఏడాది ఏప్రిల్ 9న నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం తగ్గినా ఇక్కడి నుంచి సేవలు అందిస్తున్నారు. మిగతా పోలీస్‌స్టేషన్లలో ఉన్నట్టు లాకప్ రూంలు, ఫిర్యాదుల స్వీకరణ, సీసీటీవీల పర్యవేక్షణ, రికార్డుల గదులు ఉన్నాయి.


Pratiroju 




