అదానీ సోలార్​కు అరుదైన ఘనత- భారత్​ నుంచి ఏకైక కంపెనీగా రికార్డ్!​

అదానీ సోలార్​కు అరుదైన ఘనత- భారత్​ నుంచి ఏకైక కంపెనీగా రికార్డ్!​

ప్రఖ్యాత వుడ్ మెకెంజీ ర్యాకింగ్స్​లో అదానీ సోలార్​కు దక్కిన స్థానం- 8వ స్థానంలో నిలిచిన కంపెనీ

భారత్​కు చెందిన అదానీ సోలార్​ ప్రఖ్యాత అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ గ్రీన్​ ఎనర్జీ ఉత్పత్తి విభాగంలో ప్రఖ్యాత వుడ్ మెకెంజీ ర్యాకింగ్స్​లో చోటు దక్కించుకుంది. అదానీ న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ANIL)కు సంబంధించిన అదానీ సోలార్‌కు గ్రేడ్ Aతో ప్రపంచవ్యాప్తంగా 8వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సోలార్ మాడ్యూల్ తయారీదారులనను పరిశీలించి ర్యాంకింగ్‌ ఇవ్వగా, అందులో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ కంపెనీగా అదానీ సోలార్ నిలిచింది.

2025 మొదటి ఆరునెలలకు గాను వుడ్ మెకెంజీ తన తాజా "గ్లోబల్ సోలార్ మాడ్యూల్ తయారీదారు ర్యాంకింగ్" నివేదికను విడుదల చేసింది. ఇది సోలార్ ప్యానెల్ కంపెనీలకు సంబంధించిన షిప్‌మెంట్‌లు, బ్యాంకింగ్, పనితీరును అంచనా వేస్తుంది. సుమారు 38 సంస్థలను పరిశీలించి వుడ్ మెకెంజీ తన నివేదికను ప్రచురించింది. ఇందులో JA సోలార్ 91.7 పాయింట్లు, ట్రినాసోలార్ 91.6 స్కోరుతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. ఇక అదానీ సోలార్ 81 పాయింట్లను సాధించింది. థర్డ్-పార్టీ విశ్వసనీయత పరీక్ష, ఆర్థిక నిర్వహణ, తయారీ ట్రాక్ రికార్డ్, పేటెంట్ కార్యకలాపాలు వంటి 10 ప్రమాణాల ఆధారంగా అంచనా వేస్తుంది. ఇందులో గ్రేడ్ A రేటింగ్ పరిశ్రమ అత్యున్నత పనితీరు, పారదర్శకత ప్రమాణాలను చేరుకునే కంపెనీలకు కేటాయిస్తుంది.

ప్రఖ్యాత సంస్థ గుర్తింపుతో అదానీ సోలార్‌కు కీలకమైన మైలురాయిని సాధించింది. అదానీ సోలార్ DMEGC సోలార్ 100 శాతం వినియోగ రేటును నిర్వహించిందని నివేదిక పేర్కొంది. ఇంకా రేటింగ్ సాంకేతిక సామర్థ్యం, సప్లై చైన్​ స్థితిస్థాపకత, ఏకీకరణ, పరిశోధన-అభివృద్ధి, పర్యావరణ, సామాజిక, పాలనా పద్ధతులు, కార్పొరేట్ బాధ్యత వంటి ప్రమాణాల్లో బలమైన పనితీరును కనపరిచింది.

2025 నాటికి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో 15,000 MW కంటే ఎక్కువ సౌర మాడ్యూళ్లను రవాణా చేసింది. ఇందులో 10,000 MW భారత్​లో కాగా, మిగిలిన 5,000 MW విదేశాలకు ఎగుమతి చేసింది. అదానీ ఉత్పత్తి చేసిన వాటిల్లో దాదాపు 70 శాతం మాడ్యూళ్లను భారత్​లోని సౌర ఘటాలను ఉపయోగించి తయారు చేశారు. ఇక అదే సమయంలో 8,000 కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలు, గణనీయమైన సంఖ్యలో పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తోంది. ఫలితంగా అదానీ సోలార్‌ను మొదటి, వేగవంతమైన భారతీయ తయారీదారుగా అరుదైన మైలురాయిని అందుకుంది.