అప్పుడే గొప్ప దేశాలు నిర్మాణమవుతాయి : రాహుల్ గాంధీ
ప్రజలు వారి అభిప్రాయాలు, భావాలను వ్యక్తపరిచి వాటి కోసం పోరాడినప్పుడే గొప్ప దేశాలు నిర్మితమవుతాయన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కానీ ప్రజలు తాము నమ్మిన విషయాన్ని బయటకు చెప్పే ధైర్యం లేదని చెప్పారు. కేరళ కాంగ్రెస్ ప్రకటించిన ప్రియదర్శిని సాహిత్య అవార్డును ప్రముఖ రచయిత్రి డాక్టర్ ఎమ్ లీలావతికి ప్రదానం చేశారు రాహుల్. కొచ్చిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్, ఈ మేరకు వ్యాఖ్యానించారు.
"దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలను గమనిస్తే అందరూ ఏదో ఒకదాన్ని విశ్వసిస్తున్నారు. కానీ, వారు నమ్మే విషయాన్ని బయటకు చెప్పే ధైర్యం లేదు. గొప్ప దేశాలు మౌనంతో నిర్మాణం కాలేవు. ప్రజలు వారి అభిప్రాయాలు, భావాలను వ్యక్తపరిచి వాటి కోసం పోరాడినప్పుడే గొప్ప దేశాలు, గొప్ప ప్రజలు నిర్మితమవుతాయి. ప్రస్తుత మౌన సంస్కృతిలో నాకు దక్కాల్సింది లభిస్తున్నంత కాలం ఏమి జరిగినా పర్వాలేదనే దురాశ భావన ఇమిడి ఉంది. ప్రజలు అవమానాలు, హత్యలకు గురవడాన్ని చూస్తున్నాను. " అని రాహుల్ గాంధీ అన్నారు.


Pratiroju 




