తమిళనాడు, బంగాల్​లో NDA విజయం ఖాయం : అమిత్​ షా

తమిళనాడు, బంగాల్​లో NDA విజయం ఖాయం : అమిత్​ షా

త్వరలో తమిళనాడు, బంగాల్​లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ కూటమి విజయం సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం తమిళనాడులోని పుదుక్కోట్టైలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్​ నాగేంద్రన్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సమావేశంలో అమిత్​ షా ప్రసంగించారు. 2024 నుంచి బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ సాధించిన విజయాలను ప్రస్తావించారు. హరియాణాలో వరుసుగా మూడో విజయం, దిల్లీ, బిహార్​లలో సాధించిన విజయాల గురించి చెప్పారు. ఇక తమిళనాడు, బంగాల్​ కూడా బీజేపీ విజయాల జాబితాలో చేరే సమయం వచ్చిందని అన్నారు.