‘టీచర్ల డిప్యుటేషన్ ప్రక్రియను పూర్తిచేయాలి’
ఈనాడు, హైదరాబాద్: గత ప్రభుత్వం జారీ చేసిన జీఓ 317లోని లోపాలను సరిదిద్దుతూ.. జీఓ 190ని జారీ చేశారని, అయితే పెండింగ్లో ఉన్న జీఓ 317 ఉపాధ్యాయుల డిప్యుటేషన్ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్(ఎస్టీఎఫ్) నేతలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు, ప్రధాన కార్యదర్శి పోచయ్య తదితరులు ఆయనకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భట్టికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి.. శాలువాతో సత్కరించారు.


Pratiroju 




