యాదగిరీశుడికి వెన్నచోర కృష్ణుడి అలంకరణ
యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: అధ్యయనోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో శుక్రవారం నారసింహుడిని ఉదయం వెన్నచోర కృష్ణుడు, రాత్రివేళ కాళీయమర్దనుడి రూపాల్లో అలంకరించారు. అనంతరం మాడ వీధుల్లో భక్తులకు స్వామి దర్శనమిచ్చారు. ప్రబంధ పారాయణం కొనసాగింది. స్థానాచార్యులు, ఆలయ ప్రధాన పూజారి కాండూరి వెంకటాచార్య అవతారం విశిష్టతను విశదీకరించారు.


Pratiroju 




