తెలంగాణలో ఈ నెలలోనే మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌!

తెలంగాణలో ఈ నెలలోనే మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌!

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు ముహూర్తం సిద్ధమైంది. ఈ నెల 11 లేదా 20వ తేదీలోగా నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కసరత్తు మొదలు పెట్టాయి. తెలంగాణలో గడువు ముగిసిన 117 మున్సిపాల్టీ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించింది. 10న తుది జాబితా వెలువరిస్తుంది. దాంతో 11వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ సంక్రాంతి పండగ, సెలవుల కారణంగా కుదరకపోతే 20న విడుదల చేస్తారు. దీనికి అనుగుణంగా, మిగతా ప్రక్రియ సజావుగా సాగేలా పురపాలక పట్టణాభివృద్దిశాఖ సిద్ధమవుతోంది.