శ్రీలక్ష్మీనరసింహ స్వామికి రూ.15లక్షల విలువైన కానుకలు

శ్రీలక్ష్మీనరసింహ స్వామికి రూ.15లక్షల విలువైన కానుకలు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామివారికి ఓ భక్తుడు రూ.15లక్షల విలువైన కానుకలను అందజేశారు. రాగిపై బంగారు తాపడంతో చేసిన హనుమంత, గజ వాహనాలు, మకర తోరణం, రెండు శఠారీలను సూర్యాపేటకు చెందిన ఉప్పల అశోక్ అనే భక్తుడు స్వామివారికి సమర్పించారు. సోమవారం వీటిని ఆలయ ఈఓ భవాని శంకర్‌కు ఆయన అందజేశారు