ఇరుసుమండలో బ్లోఅవుట్‌.. ఇంకా అదుపులోకి రాని మంటలు

ఇరుసుమండలో బ్లోఅవుట్‌.. ఇంకా అదుపులోకి రాని మంటలు

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్‌ వద్ద మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. ఓఎన్జీసీ సాంకేతిక సిబ్బంది ఆధ్వర్యంలో నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయి. పెద్ద పైప్‌లైన్‌ ద్వారా ఓ గొడుగు రూపంలో నీటిని లోపలికి చొప్పిస్తున్నారు. నిన్నటితో పోల్చితే నేడు మంటల తీవ్రత కాస్త తగ్గింది. 50 శాతం వరకు మంటలు అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అక్కడి పరిస్థితిని జిల్లా కలెక్టర్ మహేశ్‌కుమార్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇప్పటికే ఇరుసుమండ గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించిన విషయం తెలిసిందే.