రూపాయి, రూపాయి పొదుపు చేసి రూ.8 కోట్లతో స్కూల్.డ్వాక్రా మహిళల విజయగాథ.. ఈ పాఠశాల కథ..

బిడ్డల భవిష్యత్తు కోసం అమ్మలు కన్న కల.. ఓ పాఠశాల నిర్మాణానికి కారణమైంది. డ్వాక్రా పొదుపు మహిళలు రూపాయి, రూపాయి పొదుపు చేసి తమ శ్రమశక్తితో ఏకంగా ఓ పాఠశాలనే నిర్మించారు.

రూపాయి, రూపాయి పొదుపు చేసి రూ.8 కోట్లతో స్కూల్.డ్వాక్రా మహిళల విజయగాథ.. ఈ పాఠశాల కథ..

బిడ్డల భవిష్యత్తు కోసం అమ్మలు కన్న కల.. ఓ పాఠశాల నిర్మాణానికి కారణమైంది. డ్వాక్రా పొదుపు మహిళలు రూపాయి, రూపాయి పొదుపు చేసి తమ శ్రమశక్తితో ఏకంగా ఓ పాఠశాలనే నిర్మించారు. 10 వేలమంది మహిళలు ఎనిమిదేళ్ల కష్టపడి.. ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేసి అధునాతన పాఠశాల భవనాన్ని నిర్మించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని బాలభారతి స్కూలు కథ ఇది..జిల్లా ఓర్వకల్లులోని బాలభారతి స్కూలు కథ ఇది..

విద్యా, వైద్యం.. మనిషి కనీస అవసరాలు.. కానీ కాలానుగుణంగా వస్తున్న మార్పులు విద్యా, వైద్యాన్ని వ్యాపారంగా మార్చివేశాయి. ఇలాంటి పరిస్థితులలో తమ బిడ్డలకు నాణ్యమైన చదువు చెప్పించాలన్న మహిళల తపనే ఆ బడికి పునాదిగా మారింది. తమ చిన్నారుల బంగరు భవిష్యత్తును ఊహించుకుంటూ ఆ తల్లులు పడిన కష్టం.. ఆ పాఠశాలకు రూపు తెచ్చింది. రూపాయి, రూపాయి పోగు చేసుకుంటూ ఆ మహిళా సంఘం చేసిన పొదుపు.. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే ఓ అధునాతన పాఠశాల నిర్మాణానికి కారణమైంది. బిడ్డల బంగారు భవిత కోసం తల్లులు పడిన వ్యథ.. కలిసికట్టుగా పొదుపు చేసుకుని కలను సాకారం చేసుకున్న డ్వాక్రా మహిళల విజయగాథ.. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని బాలభారతి స్కూలు కథ..