ఎన్‌డీడీబీ రిపోర్టును బయటపెట్టాలి: శ్రీనివాసానంద సరస్వతి

ఎన్‌డీడీబీ రిపోర్టును బయటపెట్టాలి: శ్రీనివాసానంద సరస్వతి

 వేంకటేశ్వరస్వామి అంశంపై తప్పుడు ప్రచారం చేస్తే భక్తులు క్షమించరని సాధు పరిషత్‌ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ వ్యవహారంపై మాట్లాడారు. వేంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడాలని కోరారు.

‘‘ఈ వ్యవహారంపై సిట్‌ నివేదికలు ఉన్నాయి. ఎన్‌డీడీబీ ఇచ్చిన రిపోర్టును బయటపెట్టాలి. ఇప్పటికే సాధు పరిషత్‌ తరఫున తితిదే ఈవోకి లేఖ రాశాం. లడ్డూల్లో రసాయనాలు కలిశాయని తెలిసిన తర్వాత కూడా బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యమవుతుంది? తితిదే గత ఛైర్మన్లకు తెలియకుండానే ఈ వ్యవహారం జరిగిందా? వైకాపా హయాంలోనే కల్తీ జరిగింది. అంతకుముందు లడ్డూ నాణ్యత బాగుండేది’’ అని శ్రీనివాసానంద సరస్వతి అన్నారు.