విపత్తుల నుంచి రక్షణే గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ ప్రాజెక్టు లక్ష్యం
తీర ప్రాంతాల కోతకు గురవ్వడమనేది రాష్ట్రంలో చాలా పెద్ద సమస్యగా మారింది. తుఫాన్లు వచ్చిన ప్రతిసారీ తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి. ఆ సమయంలో ఎంతో నష్టం వాటిల్లుతోంది. కాస్త వర్షాలు కురవగానే అక్కడి ప్రజలు భయంతో వణికిపోతుంటారు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? తీర ప్రాంతాన్ని ప్రకృతి విపత్తుల నుంచి ఎలా కాపాడుకోవాలి?
అదే విధంగా నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలి? ఈ ప్రశ్నల నుంచే రాష్ట్ర అటవీశాఖ సరికొత్త ఆలోచన చేసింది. అదే గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్. ఇప్పటికే కూటమి ప్రభుత్వం దీనికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఏపీలోని మొత్తం తీర ప్రాంతం పొడవునా 5 కిలోమీటర్ల వెడల్పుతో పర్యావరణ కారిడార్‌ను ఏర్పాటు చేయడానికి సంకల్పించింది. మరి ఈ ప్రాజెక్టు లక్ష్యాలేంటి? ఈ గ్రీన్ వాల్ ఎలా నిర్మించనున్నారు? భవిష్యత్ ప్రణాళికలేంటి? తదితర వివరాలన్నీ ప్రత్యేక ముఖాముఖిలో పంచుకున్నారు అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు. మరి ఆయనేం చెప్పారో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.


Pratiroju 




