అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

బాపట్ల జిల్లా నగరం మండలంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. చీరాల నుంచి రేపల్లె వెళ్తున్న బస్సు చిరకాలవారిపాలెం గ్రామ శివారుకు రాగానే మలుపు వద్ద ప్రమాదం జరిగింది. స్టీరింగ్‌లో సమస్య వల్ల బస్సు అదుపుతప్పినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి అపాయం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు