400 ఏళ్లుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక వేడుక జగ్గన్నతోట ప్రభల తీర్థం: సీఎం చంద్రబాబు
సుమారు 400 ఏళ్లుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుక జగ్గన్న తోట ప్రభల తీర్థమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏటా కనుమ రోజు జరిగే ఈ అ తిపెద్ద పండుగలో 11 పురాతన శివాలయాల నుంచి వచ్చే ఏకాదశ రుద్రుల ప్రభలు ఒకే వేదికపై దర్శనమిస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
‘‘తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని కాపాడుతూ వస్తున్న కోనసీమ ప్రజల భక్తి, విశ్వాసాలను గౌరవిస్తూ.. జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. సుమారు 5 లక్షల మంది హాజరయ్యే ఈ ఉత్సవానికి అన్ని రకాలుగా ప్రభుత్వం సహకారం అందిస్తోంది. కోనసీమలో సాంస్కృతిక పర్యాటకం మరింత అభివృద్ధి చెందడానికి మంత్రివర్గ నిర్ణయం దోహదం చేస్తుంది’’ అని సీఎం పేర్కొన్నారు.


Pratiroju 




