సీబీఐ ముందుకు టీవీకే చీఫ్ విజయ్‌

సీబీఐ ముందుకు టీవీకే చీఫ్ విజయ్‌

కరూర్‌ తొక్కిసలాట ఘటన దర్యాప్తులో భాగంగా తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ (Vijay) సోమవారం సీబీఐ (CBI) విచారణకు హాజరయ్యారు. ఇందుకోసం ఉదయం ఆయన దేశ రాజధాని దిల్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తమ నాయకుడికి భద్రత కల్పించాలని దిల్లీ పోలీసులను టీవీకే కోరింది. ఇదిలాఉంటే.. గతేడాది సెప్టెంబరు 27న కరూర్‌లో విజయ్‌ నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందారు (Karur stampede case). సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఘటన జరిగిన ప్రాంతాన్ని దర్యాప్తు సంస్థ అధికారులు పరిశీలించి పలు వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో ఇటీవల విజయ్‌కు సీబీఐ సమన్లు ఇచ్చింది.