‘సాక్షి’పై పరువు నష్టం కేసు.. విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి లోకేశ్
విశాఖపట్నం: మంత్రి నారా లోకేశ్ విశాఖలోని 12వ అదనపు జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ‘సాక్షి’ పత్రికపై వేసిన పరువు నష్టం కేసులో క్రాస్ ఎగ్జామినేషన్‌కు ఆయన వచ్చారు. ఈ కేసులో ఇప్పటికే రెండు దఫాలు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తికాగా.. మూడోసారి హాజరయ్యారు. తన పరువుకు భంగం కలిగించేలా దురుద్దేశంతో ఆ పత్రికలో తప్పుడు కథనం రాశారంటూ కోర్టులో ఆయన గతంలో దావా వేశారు.


Pratiroju 




