విదేశీ అతిథుల కోసం 100 బోట్లు సిద్ధం
విశాఖపట్నం: అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, మిలన్ వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలతో విశాఖలో సందడి నెలకొంది. ఈ వేడుకల్లో పాల్గొనడానికి వస్తున్న విదేశీ అతిథుల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మత్య్సకారులను భాగస్వాములను చేస్తూ 100బోట్లను సిద్ధం చేశారు. విదేశాల నుంచి యుద్ధనౌకల్లో వచ్చిన అతిథులకు స్వాగతం పలికి, నగరంలోని ప్రాంతాల్లో పర్యటించడానికి అనువుగా ఈ బోట్లను వినియోగిస్తారు.


Pratiroju 




