రంగురంగుల పుష్పాల పల్లకీలో అయ్యప్పస్వామి ఊరేగింపు

రంగురంగుల పుష్పాల పల్లకీలో అయ్యప్పస్వామి ఊరేగింపు

తాండూరు గ్రామీణం: బసవన్నకట్ట ఆలయ ప్రాంగణంలో ఉన్న అయ్యప్పస్వామి మహా పడిపూజలను గురువారం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం రంగురంగుల పుష్పాలతో అలంకరించిన పల్లకీలో స్వామివారిని ఊరేగించారు. పద్దెనిమిది మెట్లపై కర్పూర దీపాలు వెలిగించి స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు.