యాదగిరిగుట్టలో ఈ నెల 18న బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

యాదగిరిగుట్టలో ఈ నెల 18న బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 18 నుంచి 28 వరకు జరగనున్నాయి. 18న స్వస్తివాచనంతో ప్రారంభమై 28న రాత్రి డోలోత్సవంతో ముగియనున్నాయని ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. 24న రాత్రి ఎదుర్కోలు, 25న రాత్రి తిరుకళ్యాణ మహోత్సవం, 26న దివ్య విమాన రథోత్సవం జరగనున్నాయన్నారు. 20వ తేదీ నుంచి 26 వరకు స్వామి వారికి వివిధ అలంకార సేవలు జరుగుతాయన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 100 మంది యాజ్ఞాచార్యులు, రుత్వికులకు ఆహ్వానం పంపించామన్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్లు