పాడేరులో 4.1 డిగ్రీల ఉష్ణోగ్రత

పాడేరులో 4.1 డిగ్రీల ఉష్ణోగ్రత
పాడేరులో 4.1 డిగ్రీల ఉష్ణోగ్రత

అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. పాడేరులో గురువారం ఉదయం  4.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ అప్పలస్వామి తెలిపారు. పెదబయలులో 4.8, చింతపల్లి 5, హుకుంపేట 6.2, కొయ్యూరులో 9.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.