తెలుగు మహాసభల కోసం ‘క్యాప్సూల్ హౌస్’లు.. అధునాతన సదుపాయాలతో సిద్ధం
గుంటూరులో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న తెలుగు మహాసభల కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీఐపీలు సహా పలువురు అతిథులు మహాసభలకు తరలిరానున్న వేళ వారి వసతి కోసం అధునాతన క్యాప్సూల్ హౌస్‌లను నిర్వాహకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. కంటైనర్ తరహాలో కనిపించే ఈ క్యాప్సూల్ హౌస్‌లు.. హోటళ్ల మాదిరిగా మంచి సదుపాయాలను అందిస్తున్నాయి. సులువుగా తరలించే వెసులుబాటుతో పాటు ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే వీలు ఉండటం వీటి ప్రత్యేకత.


Pratiroju 




