గోల్కొండలో అట్టహాసంగా ‘హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్’
గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ వేదికగా ‘హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్’ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వేడుకలను ప్రారంభించారు. అనంతరం మంత్రి స్వయంగా హాట్ ఎయిర్ బెలూన్‌లో విహరించి సందడి చేశారు. ఆకాశ మార్గంలో సుమారు గంటన్నర సేపు 13 కిలోమీటర్లు విహరించారు. హైదరాబాద్ గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ నుంచి ప్రారంభమైన హాట్ ఎయిర్ బెలూన్ అప్పాజీగూడ శివారులో దిగింది.


Pratiroju 




