ఏపీలోని రేషన్ షాపుల్లో గోధుమ పిండి పంపిణీ ప్రారంభం
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఇవాళ్టి నుంచి రేషన్ కార్డుదారులకు గోధుమ పిండి పంపిణీ చేస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లోని కార్డుదారులకు కిలో రూ. 20కు గోధుమ పిండిని అందిస్తున్నామని ఏపీ పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ ఎండీ ఢిల్లీరావు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 1800 టన్నుల గోధుమలను కేంద్రం ప్రభుత్వం నుంచి మన రాష్ట్రం తీసుకోలేదన్నారు. దీనిపై కేంద్రంతో మాట్లాడి గోధుమలు తీసుకుని, వాటిని మిల్లుల ద్వారా కాకుండా పాత పద్ధతిలో (తిరగలి ద్వారా) పిండి పట్టించి కార్డుదారులకు ఇస్తున్నామని చెప్పారు. దీని వల్ల గోధుమ పిండిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. జిల్లా కేంద్రాల్లో గోధుమ పిండి పంపిణీ విజయవంతమైతే తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు.


Pratiroju 




