ఆత్రేయపురంలో ‘సంక్రాంతి’ సందడి.. ప్రారంభమైన పడవల పోటీలు

ఆత్రేయపురంలో ‘సంక్రాంతి’ సందడి.. ప్రారంభమైన పడవల పోటీలు

రావులపాలెం పట్టణం: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మూడు రోజుల పాటు ‘సర్‌ ఆర్థర్‌ కాటన్‌ గోదావరి ట్రోఫీ’ పేరిట వివిధ పోటీలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తొలిరోజు ఈత, రంగవల్లుల పోటీలు, ఫుడ్‌ ఫెస్టివల్‌ జరిగాయి. రెండో రోజు డ్రాగన్‌ పడవల పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, అధికారులు ప్రారంభించారు. దీనిలో పాల్గొనేందుకు పలు రాష్ట్రాల నుంచి సుమారు 250 మంది వచ్చారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలిరావడంతో ఆత్రేయపురంలో సందడి వాతావరణం నెలకొంది.