మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం: మహేశ్‌కుమార్ గౌడ్
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. సర్వేల ఆధారంగా అభ్యర్థులకు బీఫామ్‌లు ఇస్తామని చెప్పారు. నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘‘పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నాం. మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం కాంగ్రెస్‌దే. నిజామాబాద్ నగరంలో మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్నబియ్యం పంపిణీ జరుగుతోంది. గతంలో పేదవాడి సొంతింటి కల నెరవేరలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తోంది. రెండో దశలోనూ మంజూరు చేస్తాం. నిజామాబాద్ జిల్లాకు మరో రెండు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఓట్ల రూపంలో మారనుంది. దేశంలో వేల ఉద్యోగాలను తొలగించిన ఘనత ప్రధాని మోదీది. భాజపాకు ఎందుకు ఓటెయ్యాలో ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలి. దేవుడి పేరుతో ఓట్లు అడిగే హక్కు ఆ పార్టీకి ఎవరిచ్చారు? అలాంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో లేదు’’ అని మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు.


Pratiroju 




