భారత్‌కు.. వెనెజువెలా చమురు?
రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించుకోవాలని భారత్‌పై అమెరికా (US) ఒత్తిడి తీసుకువస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌కు వెనెజువెలా చమురు విక్రయించడానికి ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. అమెరికా నియంత్రణలో ఉన్న కొత్త చట్టం కింద భారత్‌కు చమురును విక్రయించేందుకు (Venezuelan Oil To India) చర్యలు తీసుకుంటున్నట్లు వైట్‌హౌస్ అధికార వర్గాలు వెల్లడించాయి. వెనెజువెలా నుంచి అమెరికాకు 30-50 మిలియన్ బ్యారెళ్ల చమురును అప్పగించనున్న నేపథ్యంలో దానిని ప్రపంచ దేశాలకు విక్రయించాలని అమెరికా యోచిస్తోందని.. అందులోభాగంగా భారత్‌కు కూడా చమురును అమ్మడానికి సిద్ధంగా ఉందని తెలిపాయి. వెనెజువెలా చమురుపై యూఎస్ రిఫైనరీలే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయని పేర్కొన్నాయి.
వెనెజువెలాలోని తాత్కాలిక అధికారులు అధిక నాణ్యత గల 30-50 మిలియన్ బ్యారెళ్ల చమురును యూఎస్‌కు అప్పగించనున్నట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం. వెనెజువెలా నుంచి సేకరించిన చమురును మార్కెట్ ధరకే విక్రయిస్తామని.. ఆ డబ్బు తమ నియంత్రణలోనే ఉంటుందని ఆయన తెలిపారు. ఆ డబ్బును వెనెజువెలా, అమెరికా ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామన్నారు. ఈ ప్రణాళికను తక్షణమే అమలుచేయాలని ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్‌కు తాను ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. చమురు నిల్వలను నౌకల ద్వారా రవాణా చేసి.. నేరుగా అమెరికా ఓడరేవులలో దించనున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: రష్యా నుంచి చమురు కొంటే 500% సుంకం!


Pratiroju 




