కిమ్ కుమార్తెకు త్వరలోనే కీలక పదవి!
సియోల్: ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ వారసురాలిగా ఆయన కుమార్తె కిమ్-జు-యే (13)ను ప్రకటించనున్నట్లు మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. కొత్త ఏడాది సందర్భంగా నిర్వహించిన ఓ అధికారిక కార్యక్రమంలో తండ్రి కిమ్ జోంగ్ ఉన్, తల్లి రి సోల్ జుతో పాటు జు-యే కనిపించడంతో ఆమెను పాలక వర్కింగ్ పార్టీ కాంగ్రెస్‌లో ఉన్నతస్థాయి పదవిలో నియమించనున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. తల్లిదండ్రులతో కలిసి జు-యే గురువారం దేశ మాజీ అధ్యక్షులు, తన తాతముత్తాతల స్మారక ప్రదేశాన్ని జు-యే సందర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోను ఉత్తరకొరియా మీడియా ప్రచురించడంతో భవిష్యత్తులో అధికారిక పగ్గాలు ఆమెకే అందించనున్నట్లు సంకేతాలు పంపుతున్నారని వార్తలు వస్తున్నాయి. జనవరి లేదా ఫిబ్రవరిలో అధికార వర్కింగ్ పార్టీ కాంగ్రెస్ వార్షిక వేడుకలు జరగనున్నాయని, ఆ సమయంలో జు-యేకు కీలక పదవీ అప్పగించే అవకాశం ఉన్నట్లు దక్షిణ కొరియా నిఘా వర్గాలు


Pratiroju 




