11న కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ

11న కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ

 ప్రముఖ నటుడు కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఈ నెల 11న విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో ఆవిష్కరించనున్నట్లు ఆయన సోదరుడు, నిర్మాత ఆదిశేషగిరిరావు వెల్లడించారు. గురువారం విజయవాడలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తెలుగు సినిమా రంగంలో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. నగరంలో చాలా మంది ప్రముఖులతో కృష్ణకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. త్వరలోనే సినిమా అరంగేట్రం చేస్తున్న కృష్ణ మనవడు జయకృష్ణకు సూపర్‌ స్టార్‌ ఆశీస్సులు ఉంటాయన్నారు. కృష్ణ జయంతి సందర్భంగా మే 31న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. పెద్ద సినిమాల టికెట్‌ ధరలు పెంచడం వల్ల చిన్న సినిమాలకు థియేటర్లు దొరకక వాటి నిర్మాతలు నష్టపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.