మేడారం జాతర ప్రత్యేక బస్సులలో వారికి ఫ్రీ ప్రయాణం. తెలంగాణా ఆర్టీసీ తీపికబురు!
ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర, విగ్రహాలు లేని విశిష్టమైన జాతర తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తెలంగాణ ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లను చేస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద జాతరగా ఉన్న మేడారం జాతర జనవరి 28వ తేదీ నుండి జనవరి 31వ తేదీ వరకు జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటి నుంచే మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు.
మేడారం జాతరకు తెలంగాణాలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
దీంతో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిపోల నుండి మేడారానికి బస్సులు నడవనున్నాయి. ముఖ్యంగా మేడారం జాతర జరుగుతున్న ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి అత్యధికంగా బస్సులను నడపనున్నారు. వరంగల్ నుండి మేడారానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) జాతర సందర్భంగా, సాధారణ రోజుల్లోనూ ప్రత్యేక బస్సులను నడుపుతుంది.


Pratiroju 




