పారిస్‌లో 'వారణాసి' టీజర్ రిలీజ్ ఈవెంట్!- ఇండియాలోనే తొలి సినిమాాగా రికార్డ్ కొట్టే ఛాన్స్!
హీరో మహేశ్‌బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో రూపొందుతున్న చిత్రం 'వారణాసి'. దాదాపు రూ.1300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోందని సమాచారం. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీకి సంబంధించిన ఏ అప్‌డేట్‌నైనా ఓ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న.
పారిస్‌లో గ్రాండ్‌గా : గతేడాది నవంబర్‌లో ఈ సినిమా టైటిల్ రివీల్ గ్లింప్స్‌ను గ్రాండ్‌గా లాంఛ్ చేశారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ భారీ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో గ్లింప్స్ విడుదల చేశారు. దీనికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే టీజర్ గ్లింప్స్‌కు కూాడా రిలీజ్‌కు డేట్ ఫిక్స్ అయ్యిందని ప్రచారం సాగుతోంది. దీన్ని కూడా జక్కన్న భారీగానే ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
పారిస్‌లోని లే గ్రాండ్ రెక్స్ (Le Grand Rex) థియేటర్ కమ్ ఆడిటోరియంలో టీజర్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ థియేటర్ పారిస్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైంది. ఇది థియేటరే కాదు లగ్జరీ ఆడిటోరియం కూడా. ఇందులో దాదాపు 2800 మంది ఆడియెన్స్ ఒకేసారి సినిమా చూడొచ్చు. హాలీవుడ్‌కు చెందిన భారీ సినిమాల స్క్రీనింగ్స్ ఇక్కడ జరుగుతాయి. ఇందులో భారీ లైవ్ కాన్సర్ట్స్, ఆర్కెస్ట్రా ఈవెంట్లు జరగుతాయి.
అయితే ఇలాంటి లగ్జరీ వేదికగా వారణాసి టీజర్ రిలీజ్ చేయనున్నట్లు తెలిసింది. సోమవారం (జనవరి 5న) రాత్రి 9 గంటలకు టైమ్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అఫిషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఒకవేళ ఈ సినిమా టీజర్ అక్కడ రిలీజైతే, ఈ విషయంలో ఇండియాలోనే మొట్టమొదటి సినిమాగా 'వారణాసి' నిలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కంటెంట్‌ను ఇక్కడ రిలీజ్ చేయలేదు.
మరోవైపు 'వారణాసి'ని గ్లోబల్‌లో నిలబెట్టడానికి రాజమౌళి ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా అన్ని ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. ఇంకా 8 నెలల్లో వారణాసి షూటింగ్ పూర్తి కానుంది. దాంతో ఈ చిత్రాన్ని 2027 మార్చిలో విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
గ్లోబల్ ట్రాటర్ గ్లింప్స్: హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఓపెన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన టైటిల్ రిలీజ్ ఈవెంట్లో గ్లోబ్ ట్రాటర్ గ్లింప్స్ ఫ్యాన్స్‌కు పిచ్చెకించాయి. ఆ గ్లింప్స్‌లో వారణాసి 512 CE, గ్రహశకలం శాంభవి 2027 CE, అంటార్కిటికా ఆఫ్రికా, ఉగ్రభట్టి కేవల్, లంకా నగరం త్రేతా యుగం, వారణాసి మణికర్ణిక ఘాట్ వంటి ప్రసిద్ధ ప్రాంతాలు ఉన్నాయి. వీటిని చూశాక టైమ్ ట్రావెలర్, సైన్స్ ఫిక్షన్, మైథలాజికల్, యాక్షన్ అడ్వేంచర్ ఒక్కటేమిటీ ఇలాంటి అన్ని జాన్రాలతో మిక్స్ అయ్యి ఈ సినిమా ఉండనుందని అంచనాలు వేస్తున్నారు.
అయితే ఈ గ్లింప్స్‌లో మరింత ఆకట్టుకున్నది మహేశ్ నందిపై కూర్చొని రౌద్రంగా చూస్తూ, చేతిలో త్రిశూలం పట్టుకొని రావడం. మరొకటి చిన్నమస్తాదేవి గ్లింప్స్. అంతేకాకుండా ఈ సినిమా విజువల్స్ ప్రకారం 'వారణాసి' కథ భూత, భవిష్యత్, వర్తమానాల్ని కలిపిన స్టోరీగా ఉండనుందని తెలుస్తోంది. మరి ఇవే ఇంత హైప్‌గా ఉంటే టీజర్ ఇంకేంత పూనకాలు తెప్పించేలా ఉంటుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
వారణాసి టీమ్
ఈ సినిమా విషయానికొస్తే దీంట్లో బాలీవుడ్ స్టార్ ప్రియంకా చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారు. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే విజయేంద్రప్రసాద్ స్టోరీ రాశారు.


Pratiroju 




