ఇదేం చేపయ్యా.. ఇంత టాలెంటెడ్‌గా ఉంది?
తలపై జల్లెడలా ఉన్న ఈ చేపను మత్స్యకారులు చూష లేదా బిళ్ల చేపలని పిలుస్తారు. శాస్త్రీయనామం ఎఖనేస్ నాక్రటిస్. చర్మంపై గరుగ్గా ఉన్న జల్లెడలాంటి భాగం సాయంతో తిమింగలాల వంటి పెద్ద చేపలకు అతుక్కుపోతాయి. వాటితో పాటే వెళుతూ ఏ మాత్రం కష్టపడకుండా అవి తినగా వదిలేసిన ఆహారాన్ని ఆరగిస్తుంటాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడిబాడవలోని వైనతేయ నదిలో మత్స్యకారుడు అంకాని సత్యనారాయణ (బుజ్జి) వలకు సోమవారం ఈ అరుదైన చేప చిక్కింది.


Pratiroju 




