దారపు ఉండ, సూది మింగింది - ప్రాణాల మీదికి తెచ్చుకుంది
సూది, దారం మింగిన గోల్డెన్ రిట్రీవర్ - ఎక్స్రే ద్వారా బయటపడ్డ సమస్య - కుక్క ప్రాణాలు కాపాడడానికి విమానంలో దిల్లీ నుంచి విశాఖకు వచ్చిన వైద్యుడు
కొందరికి పెంపుడు జంతువులంటే అమితమైన ప్రేమ ఉంటుంది. వాళ్ల అభిరుచికి తగ్గట్టు కుక్కలు, పిల్లులు, పక్షులు, కుందేళ్లు సహా వారికి నచ్చిన వాటిని ఇంట్లో పెంచుకుంటారు. వాటిని కుక్క, పిల్లి అంటే ఊరుకోరు సుమీ! పెంపుడు జంతువులకూ పేర్లు పెట్టుకుంటారు. అలాగే పిలుస్తారు, పిలిపిస్తారు, పరిచయాలు చేస్తారు కూడా. వాటిని ఇంట్లో సభ్యుల లాగే చూసుకుంటారు. లక్షలు పోసి వాటికి పలు సపర్యలు అందిస్తారు. దానికేమైనా అయితే ఆస్పత్రికి తీసుకెళ్తారు.
ఫుడ్, బెడ్, వాకింగ్, వాషింగ్ అంటూ ఎంతో హుందాగా చూసుకుంటారు ఆ జంతువులను. అంతేనా వాటికోసం ప్రత్యేకంగా బట్టలు కూడా, కొన్ని సందర్బాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే వాటికీ ఫ్యాషన్ షోలు నిర్వహిస్తుంటారు. అక్కడ దేశ, విదేశాల బ్రీడ్లు దర్శనమిస్తాయి. ఎన్నో సార్లు ఎంతో మంది మనకన్నా కుక్క బతుకే బాగుంది కదా అని అనుకుంటూ ఉంటారు కదా.. ఆ మాటకు న్యాయం చేస్తారు ఈ పెట్ లవర్స్. ఇంతకీ ఈ పెట్ గోలేంటి అనుకుంటున్నారా? ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కకు వైద్యం చేయించడానికి దిల్లీ నుంచి డాక్టర్ను విశాఖకు రప్పించాడు మరి. అందుకే ఈ పెట్ ముచ్చట. అసలు ఆ కుక్కకు వచ్చిన సమస్యేంటి, యజమాని చేసిందేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
కుక్క పొట్టలో దారపు ఉండ, సూది: విశాఖకు చెందిన ఓ వ్యక్తి గోల్డెన్ రిట్రీవర్ జాతి కుక్కను పెంచుకుంటున్నాడు. దాని వయసు 3 సంవత్సరాలు ఉంటుంది. అదంటే ఆ యజమానికి అమితమైన ప్రేమ. దాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం అది అకస్మాత్తుగా తరుచూ అనారోగ్యానికి గురైంది. దీంతో దాన్ని ఈ నెల 5వ తేదీన గురువారం ఓ పెట్డాగ్ ఆస్పత్రికి తీసుకెళ్లి, పలు వైద్య పరీక్షలు చేయించారు. ఎక్స్రే తీసిన డాక్టర్ శ్రీధర్ కుక్క పొట్టలో దారపు ఉండ దాంతోపాటు సూది ఉన్నట్లు గుర్తించారు.
45 నిమిషాల ఎండోస్కోపీతో కుక్క సేఫ్: ఎలాగైనా కుక్క కడుపులో ఉన్న దారం ఉండను బయటకు తియ్యాలని దాని యజమాని డాక్టర్ను కోరారు. సాధారణంగా శస్త్రచికిత్స చేసి దారం, సూది బయటకు తీద్దామని అనుకున్నాడు వైద్యుడు. కానీ కుక్కకు ప్లేట్లెట్స్ పడిపోవడంతో ఆ ప్రక్రియ సాధ్యపడలేదు. దీంతో ఆ యజమాని మరింత దిగులు చెందాడు. తన కుక్కను ఎలాగైనా కాపాడాలని వేడుకున్నాడు. శ్రీధర్ దిల్లీలో ఉన్న తన స్నేహితుడు, జంతు వైద్య స్పెషలిస్ట్ వెటర్నరీ డాక్టర్ విక్రమ్ మల్హోత్రకు ఇక్కడ కుక్క పరిస్థితి సహా శస్త్రచికిత్స గురించి వివరించారు.


Pratiroju 




